Kompally: కొంపల్లి జీహెచ్‌ఎంసీ ప్రజావాణికి 5 వినతులు

Kompally: జీహెచ్‌ఎంసీ కొంపల్లి సర్కిల్-56 కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ డి. లావణ్య అధ్యక్షతన ప్రజావాణి నిర్వహణ.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 24 Aug 2026 5:52 PM IST
Kompally
X

Kompally: కొంపల్లి జీహెచ్‌ఎంసీ ప్రజావాణికి 5 వినతులు

కొంపల్లి: సిఎంసీ, కొంపల్లి సర్కిల్–56 కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ డి. లావణ్య ప్రజల నుండి వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో మొత్తం 5 వినతి పత్రాలు (అప్లికేషన్లు) స్వీకరించబడినవి.

1. సూరారం కాలనీ, భవానీ నగర్‌లోని పోచమ్మ ఆలయంలో బహిరంగ వ్యాయామశాల మరియు పిల్లల ఆట పరికరాలు ఏర్పాటు చేయవలసిందిగా అభ్యర్థన.

2. సూరారం తులసి లేక్ చుట్టూ వీధి దీపాలు మరియు దీపస్తంభాలు ఏర్పాటు చేయవలసిందిగా అభ్యర్థన.

3. సూరారం తులసి లేక్ చుట్టూ రహదారుల నిర్మాణం మరియు అభివృద్ధి చేపట్టవలసిందిగా అభ్యర్థన.

4. TDR మొత్తం గణన/వర్తింపజేసే సమయంలో తాజా మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకోవలసిందిగా అభ్యర్థన.

5. ముత్వాల బస్తీలో రోడ్లు ఆక్రమణకు గురైన విషయంపై పరిశీలించి తగిన చర్యలు తీసుకోవలసిందిగా వినతి.

స్వీకరించిన వినతులను సంబంధిత శాఖ అధికారులకు పంపించి, త్వరితగతిన పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్ డి. లావణ్య ఆదేశాలు జారీ చేశారు.

అధికారులు ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకొని, నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story