Hyderabad: మీరుపేట్‌లో ఘోర ప్రమాదం ఇద్దరు మృతి!
Hyderabad: హైదరాబాద్ మీరుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Hyderabad: మీరుపేట్‌లో ఘోర ప్రమాదం ఇద్దరు మృతి!
హైదరాబాద్: మీరుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున 2 గంటలకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ సంఘటనా స్థలంలో మృతి చెందగా, మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గూర్రంగూడ ఆదిత్యనగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ సబావత్ సునీల్ (35) ఆటో మండమల్లమ్మ చౌరస్తా సమీపంలోని సాగర్ హైవేపై చెడిపోవడంతో రోడ్డుపక్కన నిలిపివేశాడు.
వాహనాన్ని టోయింగ్ చేయడానికి సబావత్ ప్రసాద్ (26) ను అకడికి పిలిచాడు. ఈ క్రమంలో నందనవనం ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ సబావత్ సంతోష్ (35) ప్రసాద్‌ను కలవడానికి అక్కడికి వచ్చి సునీల్ ఆటో సమీపంలో నిలబడ్డాడు. అదే సమయంలో ప్రసాద్ రోడ్డు దాటుతుండగా, ఎల్‌బీనగర్ వైపు నుంచి చాంద్రాయణగుట్ట దిశగా వెళ్తున్న GHMC టిప్పర్ లారీ (AP29V3873) అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చి రోడ్డుపక్కన ఉన్న సంతోష్, సునీల్‌లను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సబావత్ సంతోష్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సునీల్ గాయపడగా, 108 అంబులెన్స్‌లో హస్తినాపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన GHMC టిప్పర్ లారీ డ్రైవర్‌ను వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం అరేపల్లి గ్రామానికి చెందిన జావళ సురేష్ (38)గా పోలీసులు గుర్తించారు. మీరుపేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.




