LB Nagar: సామాన్యులకు న్యాయం చేరువ చేయడమే లక్ష్యమన్న జడ్జి అనూష!
LB Nagar: కోర్టులో జి.కె.నామ్ ట్రస్ట్ P.R.A.A.N. ప్రాజెక్ట్ పోస్టర్‌ను డిఎల్ఎస్ఏ సెక్రటరీ, జడ్జి జి. అనూష ఆవిష్కరించారు. దివ్యాంగుల కోసం హెల్ప్‌లైన్ ప్రారంభించారు.
LB Nagar: సామాన్యులకు న్యాయం చేరువ చేయడమే లక్ష్యమన్న జడ్జి అనూష!
ఎల్బీనగర్: జి.కె.నామ్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న P.R.A.N. (ప్రజా ఫిర్యాదుల పరిష్కార అనుసంధాన నెట్‌వర్క్) ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రాజెక్ట్ అసోసియేట్ శ్రీ వి. ఉత్తమ్ కుమార్ మరియు సీనియర్ కన్సల్టెంట్ శ్రీ కె. దీపక్ రంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలోని _జిల్లా న్యాయ సేవా సంస్థ (D.L.S.A.)_ను సందర్శించారు.
ఈ సందర్భంగా వారు D.L.S.A. కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి. అనూష గారితో P.R.A.N. ప్రాజెక్ట్ అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలో ప్రాజెక్ట్ అమలు విధానం, ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేయడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
అనంతరం ఈ విషయాన్ని గౌరవనీయ ప్రధాన జిల్లా న్యాయమూర్తి శ్రీ A. కర్ణ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లి, వారి మార్గదర్శకత్వం మరియు సహకారాన్ని కోరారు.
P.R.A.A.N. ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యాలు:
ప్రజల్లో న్యాయ అవగాహన పెంపొందించడం న్యాయపరమైన మార్గదర్శకత్వం అందించడం అవసరమైన సందర్భాల్లో సంబంధిత శాఖలు మరియు అధికారులతో సమన్వయం కల్పించడం. ముఖ్యంగా దివ్యాంగులు న్యాయపరమైన లేదా సామాజిక సమస్యలను ఎదుర్కొన్నప్పుడు D.L.S.A. ద్వారా తగిన సహాయం అందేలా చేయడం
న్యాయపరమైన, సామాజిక లేదా ఇతర సంబంధిత సమస్యలు ఎదురైనప్పుడు ప్రజలు వెంటనే _జిల్లా న్యాయ సేవా సంస్థ (D.L.S.A.)_కు సమాచారం అందించాలని కోరారు.అవసరమైన సహాయం, సలహాలు మరియు మార్గదర్శకత్వం కోసం P.R.A.N. ప్రాజెక్ట్ అసోసియేట్ శ్రీ వి. ఉత్తమ్ కుమార్: 9505393758 ను సంప్రదించవచ్చు.
ఈ సందర్భంగా ప్రాజెక్ట్ బృందం గౌరవనీయ ప్రధాన జిల్లా న్యాయమూర్తి శ్రీ A. కర్ణ కుమార్ గారికి, కార్యదర్శి శ్రీమతి జి. అనూష గారికి, అలాగే జిల్లా న్యాయ సేవా సంస్థ అధికారులకు వారి అమూల్యమైన సహకారం, ప్రోత్సాహం మరియు మార్గదర్శకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.
ఈ కార్యక్రమం జి.కె.నామ్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మరియు చైర్‌పర్సన్ డా. సుప్రియా రత్న కుమార్ గౌడ్ గారి దూరదృష్టి, మార్గదర్శకత్వం, నిరంతర ప్రోత్సాహంతో విజయవంతంగా నిర్వహించబడింది.
దివ్యాంగులు మరియు అవసరమైన ప్రజలకు న్యాయ అవగాహన, న్యాయ సహాయం, ప్రభుత్వ సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకురావడం, అలాగే ప్రతి జిల్లాలో D.L.S.A.లతో సమన్వయం చేస్తూ ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడమే P.R.A.A.N. ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని ప్రాజెక్ట్ బృందం పేర్కొంది. ప్రజలందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.




