Extramarital Dating: హైదరాబాద్లో వివాహేతర డేటింగ్ యాప్.. మహిళల చూపు వాళ్ల వైపే
Extramarital dating app: భారతదేశంలో వివాహేతర డేటింగ్ యాప్ గ్లీడెన్ వినియోగంపై షాకింగ్ రిపోర్ట్. 40 లక్షల మంది యూజర్లతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.
Extramarital dating app: హైదరాబాద్లో వివాహేతర డేటింగ్ యాప్.. మహిళల చూపు వాళ్ల వైపే
Hyderabad Dating: భారతీయ సంస్కృతిలో పెళ్లికి ఉన్న పవిత్రత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, మారుతున్న జీవనశైలి, టెక్నాలజీ పుణ్యమా అని సీక్రెట్ డేటింగ్ వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. వివాహేతర డేటింగ్ యాప్ గ్లీడెన్ నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
40 లక్షల మంది భారతీయులు
ఈ యాప్ను ఉపయోగిస్తున్న భారతీయుల సంఖ్య ఏకంగా 40 లక్షలు దాటడం గమనార్హం. ఇందులో 65 శాతం పురుషులు ఉంటే, 35 శాతం మంది మహిళలు ఉన్నారు. అయితే, గత రెండేళ్లలో మహిళల భాగస్వామ్యం ఏకంగా 148 శాతం పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మహిళలు తమ నిర్ణయాల్లో చూపిస్తున్న స్వేచ్ఛకు, ఆత్మవిశ్వాసానికి ఇది నిదర్శనమని గ్లీడెన్ ఇండియా మేనేజర్ సిబిల్ షిడెల్ పేర్కొన్నారు.
టాప్ నగరాల్లో మన భాగ్యనగరం
రహస్యంగా డేటింగ్ చేసే వారి సంఖ్య బెంగళూరు (18%) లో అత్యధికంగా ఉండగా, మన హైదరాబాద్ 17 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ 11%, ,ముంబై 9%,, పూణె 7% ఉండటం విశేషం. ఈ ధోరణి కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా లక్నో, పాట్నా, సూరత్ వంటి టైర్-2 నగరాలకు కూడా వేగంగా విస్తరిస్తోంది.
ఎప్పుడు.. ఎవరి కోసం వెతుకుతున్నారు?
సర్వే ప్రకారం యూజర్లు రోజుకు సగటున ఒక గంట నుంచి గంటన్నర సమయం ఈ యాప్లో గడుపుతున్నారు. మధ్యాహ్నం 1 నుండి 3 గంటల మధ్య , రాత్రి 10 గంటల నుండి అర్ధరాత్రి వరకు యాప్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోంది. పురుషులు 25-30 ఏళ్ల వయసున్న మహిళల కోసం వెతుకుతుంటే, మహిళలు 30-40 ఏళ్ల మధ్య ఉండి ఆర్థికంగా స్థిరపడిన డాక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ల వైపు మొగ్గు చూపుతున్నారు.




