Kondapur: గోల్డెన్ తులిప్ కాలనీలో ఓపెన్ జిమ్ ప్రారంభించిన ఆరెకపూడి!

Kondapur: కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్ తులిప్ కాలనీలో రూ. 15 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 21 July 2026 7:06 PM IST
Kondapur
X

Kondapur: గోల్డెన్ తులిప్ కాలనీలో ఓపెన్ జిమ్ ప్రారంభించిన ఆరెకపూడి!

కొండాపూర్: కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్ తులిప్ కాలనీ లో రూ.15 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ గోల్డెన్ తులిప్ కాలనీ లో రూ. 15 లక్షల తో అన్ని హంగులతో సకల సౌకర్యాలతో

ఓపెన్ జిమ్ ను ప్రారంభించుకోవడం జరిగినది అని, ఆరోగ్య శేరిలింగంపల్లి నా ధ్యేయం అని, ప్రతి కాలనీ లో, పార్క్ లలో ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేస్తామని, కాలనీ వాసులు ఓపెన్ జిమ్ ల ద్వారా ప్రతి రోజు వ్యాయమం చేసుకోవడానికి ఎంతగానో తోడ్పడుతాయి అని, వృద్ధులకు, పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని PAC చైర్మన్ గాంధీ గారు అన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, కొండాపూర్ డివిజన్ మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని PAC చైర్మన్ గాంధీ గారు పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్ర గుడ్ల శ్రీనివాస్ యాదవ్ గోల్డెన్ తులిప్ కాలనీ వాసులు విద్యాసాగర్ రెడ్డి,రాజు, సత్యనారాయణ, మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story