Madugula: మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన గోలి శ్రీనివాస్ రెడ్డి!
Madugula: మాడ్గుల మండలం నాగిళ్లలో అనారోగ్యంతో మృతి చెందిన చాట్ల పోచమ్మ కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సాయం అందజేసిన చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి.
Madugula: మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన గోలి శ్రీనివాస్ రెడ్డి!
Madugula: మాడ్గుల మండలం నాగిళ్ల గ్రామానికి చెందిన చాట్ల పోచమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. నాగిళ్ల సర్పంచ్ పాలకూర్ల సంతోష రాజు గౌడ్ ద్వారా విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సత్తయ్య, BRS సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ సురమల సత్తయ్య, బండ నరసింహ, నాగిళ్ల మహేష్, పల్లెటూరు చంద్రయ్య, నేమురి యాదయ్య, వార్డు సభ్యులు చాట్ల లక్ష్మి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.




