Amangal: మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన గోలి శ్రీనివాస్ రెడ్డి!
Amangal: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలో మృతి చెందిన లండం ఈదమ్మ కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం అందజేసిన తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి.
Amangal: మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన గోలి శ్రీనివాస్ రెడ్డి!
Amangal: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని 5 వార్డుకు చెందిన లండం ఈదమ్మ ఇటీవల మృతి చెందారు. ఈ విషయం స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు చలిచీమల సతీష్ ద్వారా తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయాన్ని స్థానిక నాయకుల ద్వారా అందజేశారు.
ఈ కార్యక్రమంలో లండం కృష్ణయ్య, లండం మల్లేష్, లండం కృష్ణ, లండం చింటూ, లండం శివ, లండం రామ్, పసుపుల కృష్ణ, జంతుక కుమార్, కిన్నెర శివ, ఏకుల కార్తీక్, సాంపూర్ గణేష్, జంతుక మహేష్ తదితరులు పాల్గొన్నారు.




