Golkonda: గోల్కొండ జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

Golkonda: తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాల ప్రతీక ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు భాగ్యనగరంలో వైభవంగా ప్రారంభమయ్యాయి.

SYED MUJTABA HUSSAIN, OLD CITY
Published on: 16 July 2026 1:42 PM IST
Golkonda
X

Golkonda: గోల్కొండ జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

Golkonda: తెలంగాణ సాంస్కృతి. సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాడ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా సప్తమాతృకల-సప్త బంగారు బోనం సమర్పణలో భాగంగా శ్రీ భాగ్యనగర్ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు, మల్యాల మధుసూదన్ యాదవ్, ఆధ్వర్యంలో హరిబౌలి శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,

అనంతరం వివిధ కళాకారుల నృత్యాల నడుమ భాజా భజంత్రీల తో జోగిని అవికాదేవి. మరియు పోతరాజుల నృత్యాల తో గోల్కొండ కోట పై శ్రీ జగదాంబిక అమ్మవారి దేవాలయానికి తొలి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు.

ఓడిబియ్యంతో బయలుదేరారు. ఈ సందర్భంగా శ్రీ భాగ్యనగర్ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు, మల్యాల మధుసూదన్ యాదవ్, మాట్లాడుతూ ప్రజలు సుఖశాంతులతో పాటు పాడి పంటలు పచ్చగా ఉండాలని కోరుతూ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి దేవాలయాలకు చెందిన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

SYED MUJTABA HUSSAIN, OLD CITY

SYED MUJTABA HUSSAIN, OLD CITY

Next Story