Hyderabad: హైదరాబాద్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో వైభవంగా గోవర్ధన పూజ!

Hyderabad: హైదరాబాద్‌లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో గోవర్ధన పూజ, కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. గోపూజ, అన్నకూటం, దామోదర హారతి నిర్వహించిన సత్య గౌర చంద్ర స్వామీజీ.

RAJESH,	WEST ZONE
Published on: 11 Nov 2026 9:27 AM IST
Hyderabad
X

Hyderabad: హైదరాబాద్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో వైభవంగా గోవర్ధన పూజ!

Hyderabad: హైదరాబాద్‌లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో గోవర్ధన పూజ, కార్తీక దీపోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోవర్ధన పర్వత ప్రతిరూపాన్ని ఏర్పాటు చేసి, వివిధ రకాల స్వీట్లు, పిండివంటలతో అన్నకూటాన్ని శ్రీ రాధా గోవిందులకు సమర్పించారు. గోపూజ, పల్లకీ ఉత్సవం, ప్రత్యేక హారతులు భక్తులను ఆకట్టుకున్నాయి.

అనంతరం కార్తీక దీపాలను వెలిగించి దామోదర హారతి నిర్వహించారు. ఈ సందర్భంగా హరే కృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ అధ్యక్షులు సత్య గౌర చంద్ర స్వామీజీ గోవర్ధన లీల విశిష్టతను, శ్రీకృష్ణుడి భక్తవత్సలత్వాన్ని వివరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అన్నకూట ప్రసాద వితరణతో వేడుకలు ముగిశాయి.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE