Hayathnagar: హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఓరియంటేషన్ వేడుకలు!
Hayathnagar: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సర ప్రథమ సంవత్సర బిఏ, బీకాం, బీఎస్సీ మరియు బీబీఏ నూతన విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు.
Hayathnagar: హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఓరియంటేషన్ వేడుకలు!
హయత్నగర్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్ నగర్ లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రథమ సంవత్సర బిఏ, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బీఎస్సీ లైఫ్ సైన్స్ , బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ విద్యార్థులకు ఒరియంటేషన్ నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ పి. సురేష్ బాబు గారు అధ్యక్షత వహించారు. ఈసందర్బంగా ప్రిన్సిపాల్ కళాశాల వనరులు, సేవలు సద్వినియోగం చేసుకొని విద్యార్థులు జీవితంలో ఎదగాలని తెలిపారు.
రాష్ట్రం లోనే అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఇక్కడ పని చేస్తున్నారని తెలిపారు. డిగ్రీ విద్యలో వచ్చిన నూతన విషయాలు అన్నింటిని విద్యార్థుల కు వివరించారు. సెమిస్టర్ విధానంలో పరీక్షల నిర్వహణ, ఆన్ లైన్ ఫీజు చెల్లింపులు, సబ్జెక్టులలో క్రెడిట్ గురించి, కళాశాల టైమ్ టేబుల్, లైబ్రరీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్,
నేషనల్ సర్వీస్ స్కీమ్, మొదలగు అన్ని విషయాలు విద్యార్థులకు వివరించారు. కళాశాల అధ్యాపకులందరినీ పరిచయం చేశారు. ఆయా కోర్సలలో ఉన్న ఉద్యోగ అవకాశాలను విద్యార్థులకు తెలియ చేశారు. ఉన్నత విద్య అవకాశాలు, శిక్షణ, క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాల కల్పన ఉందని, మా కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొంటారని వివరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వి. శ్రీనివాస్ రెడ్డి. వైస్ ప్రిన్సిపాల్ 2 శ్రీమతి వి. ఇందిర అకాడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ బి. నర్సింహ, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ మధు, కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ బాల నర్సింహ, ఫిజిక్స్ విభాగాధిపతి డాక్టర్ అవేస్ మోహిద్దీన్, బోటనీ విభాగాధిపతి డాక్టర్ యాదగిరి, జంతు శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ నర్సయ్య, కామర్స్ విభాగాధిపతి డాక్టర్ రమాదేవి, హిస్టరీ విభాగాధిపతి డాక్టర్ గంగాధర్, పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ శ్రీపతి నాయుడు,ఇంగ్లీష్ విభాగాధిపతి డాక్టర్ డి. మక్ల, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి Dr.శారదా దేవి డాక్టర్ గీత నాయక్ విభాగాధిపతి ప్రభుత్వ పాలన శాస్త్రం, ఎం నరసింహ స్టాటిస్టిక్స్ విభాగాధిపతి, హిందీ విభాగాధిపతి డాక్టర్ అపర్ణ చతుర్వేది, లైబ్రేరియన్ మరియు కెరీర్ గైడెన్స్ ప్లేస్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ దుర్గాప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ అనిత మరియు అధ్యాపకులందరు పాల్గొన్నారు.




