Sainikpuri: విజయ గణపతి ఆలయంలో త్వరలో రాజసూయ యాగం: గవర్నర్!
Sainikpuri: కాప్రా సైనిక్‌పురి శ్రీ విజయ గణపతి ఆలయంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రత్యేక పూజలు చేశారు. త్వరలో ఆలయంలో రాజసూయ యాగం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
Sainikpuri: విజయ గణపతి ఆలయంలో త్వరలో రాజసూయ యాగం: గవర్నర్!
సైనిక్‌పురి: శంకర్ మట్టు శృంగేరి శారదా పీఠం శ్రీ విజయ గణపతి ఆలయంలో త్వరలో రాజసూయ యాగం నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల పేర్కొన్నారు. కాప్రా సర్కిల్ పరిధిలోని సైనిక్‌పురి కందిగూడా శ్రీ విజయ గణపతి ఆలయంలో నిర్వహించిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో ఆయన ప్రత్యేక అత్యధిక పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సైనిక్‌పురి విజయ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శృంగేరి శారద పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైనిక్‌పురి కందిగుడ శృంగేరి విజయ గణపతి ఆలయంలో కమిటీ ఆహ్వానం మేరకు ఆయన విచ్చేసి ప్రత్యేక హోమాలు పూజలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిటీ వారు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రతినిత్యం హోమాలు అభిషేకాలు పారాయణాలు లక్షల సంఖ్యలో నిర్వహిస్తూ లోక కళ్యాణం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ నిర్వాహకులు పండరీనాథ్ పేర్కొన్నారు.
గవర్నర్ రాకను పురస్కరించుకొని మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఉప్పల్ జోన్ అడిషనల్ డిసిపి వెంకటరమణ ఆధ్వర్యంలో కుషాయిగూడ పోలీసులు భారీ బంధ వస్తే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు వందలాది మంది భక్తులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కుషాయిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, క్రైమ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు సబ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.




