Quthbullapur: 6,685 మందికి కొత్త పింఛన్లు పంపిణీ చేసిన మహేందర్ రెడ్డి!

Quthbullapur: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటించి, కొత్తగా మంజూరైన 6,685 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 18 Nov 2026 12:28 PM IST
Quthbullapur
X

Quthbullapur: 6,685 మందికి కొత్త పింఛన్లు పంపిణీ చేసిన మహేందర్ రెడ్డి!

Quthbullapur: వృద్ధాప్యం, దివ్యాంగత్వం, ఇతర కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు పింఛన్లు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో మరో 6,685 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేయడంతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనమండలి ప్రభుత్వ చీఫ్‌విప్‌ డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కొంపల్లిలోని కేవీఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా మంజూరైన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అర్హులైన నిరుపేదలకు పింఛన్లు అందించడం ద్వారా వారి జీవనానికి ఆర్థిక చేయూత లభిస్తుందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని చింతల్‌లో 1,657, దుండిగల్‌లో 793, గాజులరామారంలో 1,214, కొంపల్లిలో 1,465, నిజాంపేట మున్సిపల్‌ పరిధిలో 520, కుత్బుల్లాపూర్‌లో 1,036 మందికి కొత్తగా పింఛన్లు మంజూరైనట్లు వెల్లడించారు.

మొత్తం 6,685 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద, జోనల్‌ కమిషనర్‌ పింకేష్‌ (ఐఏఎస్‌), డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌, నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కొలను హనుమంతరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR