Hayathnagar: టీబీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ప్రిన్సిపల్!
Hayathnagar: హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్, జిల్లా క్షయ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో టీబీ నిర్మూలన అవగాహన సదస్సు నిర్వహించారు.
Hayathnagar: టీబీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ప్రిన్సిపల్!
హయత్‌నగర్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) యూనిట్–1, యూనిట్–2 మరియు జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ విభాగాల ఆధ్వర్యంలో క్షయ వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా NSS యూనిట్–1 ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఈ. యాదగిరి రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. సురేష్ బాబు అధ్యక్షత వహించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు క్షయ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు మంచి పౌష్టికాహారం తీసుకుని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు.
రంగారెడ్డి జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ విభాగం అధికారి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ క్షయ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు తీసుకోవాల్సిన చికిత్స తదితర అంశాలను విద్యార్థులు, NSS వాలంటీర్లకు వివరించారు.
ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఈ. యాదగిరి రెడ్డి, డాక్టర్ ఎస్. శారదాదేవి, ప్రియాంక, టీవీ కంట్రోల్ మెడికల్ ఆఫీసర్, అబ్దుల్లాపూర్‌మెట్ టీబీ కంట్రోల్ బోర్డ్ సిబ్బంది విల్సన్, రవి, కళాశాల గ్రంథపాలకులు, కెరీర్ గైడెన్స్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ దుర్గాప్రసాద్, NSS వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.




