Hayathnagar: ఆర్టీసీ కార్మికులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది..ఎమ్మెల్యే!

Hayathnagar: ఆర్టీసీ కార్మికులకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు.

AJAY, HAYATH NAGAR
Published on: 19 Oct 2026 6:48 AM IST
Hayathnagar
X

Hayathnagar: ఆర్టీసీ కార్మికులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది..ఎమ్మెల్యే!

Hayathnagar: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు.

ఇటీవల జరిగిన టీజీఎస్‌ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో హయత్‌నగర్‌-1 డిపోలో టిడబ్ల్యూయూ (TWU) యూనియన్ విజయం సాధించిన సందర్భంగా, యూనియన్ నాయకులు హయత్‌నగర్ డిపో గౌరవాధ్యక్షుడు, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యూనియన్ నాయకులను అభినందించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో TWU యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR