Tarnaka: తార్నాకలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం!
Tarnaka: హైదరాబాద్ తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాన్ని డాక్టర్ మోహన్‌రావు ప్రారంభించారు.
Tarnaka: తార్నాకలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం!
Tarnaka: తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మోహన్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తిక చంద్రారెడ్డి తదితరులు కేంద్రాన్ని సందర్శించి, నమోదు ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మోహన్‌రావు మాట్లాడుతూ అర్హత కలిగిన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల ఓటు ప్రజాస్వామ్యంలో కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదుపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
పట్టభద్రుల సౌకర్యార్థం తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఓటరు నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నవంబర్ 6 వరకు నమోదు కార్యక్రమం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామ్మోహన్‌రెడ్డి, నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జలంధర్‌రెడ్డి, స్థానిక కాలనీవాసులు బండ శివారెడ్డి, కరుణాకర్, వీరన్న, కొన్నె సంపత్, సయ్యద్ ఖలేద్ షాతో పాటు పలువురు అసోసియేషన్ సభ్యులు హరి కుమారి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.




