Vikarabad: పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి: తహసీల్దార్!
Vikarabad: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రారంభం నవంబర్ 6 వరకు ఫారం-18 దరఖాస్తుల గడువు అర్హులంతా నమోదు చేసుకోవాలని వికారాబాద్ తహసీల్దార్ లక్ష్మీనారాయణ పిలుపు.
Vikarabad: పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి: తహసీల్దార్!
వికారాబాద్: పట్టభద్రులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని వికారాబాద్ తహశీల్దార్ లక్ష్మీనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.28 సెప్టెంబర్ 2026నాడు పట్టభద్రుల నియోజకవర్గ నోటిఫికేషన్ వచ్చిందని అందులో భాగంగా అన్ని మండల రెవెన్యూ కార్యాలయ వద్ద ప్రచురించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ప్రతి పట్టభద్రుడు 31 జనవరి 2023 నాటికి పట్టభద్రుడై ఉంటే ఓటరుగా నమోదు చేసుకోవాలని చెప్పారు.
అందుకు సంబంధించిన ఫారం 18 ద్వారా వ్యక్తి వివరాలు భర్తీ చేసి ఇవ్వాలని, డిగ్రీ సర్టిఫికెట్ పై గెజిటెడ్ సంతకం పెట్టి తహశీల్దార్ కార్యాలయం దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఓటరుగా నమోదు చేసుకునేందుకు 06 నవంబర్ 2026 లోపు కార్యాలయంలో ఫారం అందజేయాలని అన్నారు. ఓటర్ గా నమోదు చేసుకునేందుకు ఫారం 18 తహశీల్దార్ కార్యాలయంలో అందిస్తామని, ఎలాంటి సందేహాలు ఉన్న తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలని అన్నారు.
గతంలో ఓటరుగా ఉన్న గ్రాడ్యుయేట్స్ కూడా ఇప్పుడు తప్పక ఓటర్ గా నమోదు చేసుకోవాలని, పాత ఓటర్ జాబితాలో పేరు ఉన్న దానిని పరిగణలోకి తీసుకోవడం జరగదని చెప్పారు. కాబట్టి తప్పక మళ్లీ ఓటర్ గా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఓటర్ గా నమోదు చేసుకునేందుకు ఫారం 18 కు ఆధార్, ఓటర్ ఐడి కార్డు,డిగ్రీ సర్టిఫికెట్ గెజిటెట్ సంతకంతో ఉండాలని తెలియజేశారు. ఒక వేళ కొందరు డిప్లమా చేస్తే డిగ్రీకి సమానంగా ఉండే ఈక్వాలిటీ సర్టిఫికెట్ వారి వారి యూనివర్సిటీ నుంచి పొంది, వాటిని ఫారం 18కు అటాచ్ చేసి ఇవ్వాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు గా నమోదు చేసుకోవాలని వికారాబాద్ తహశీల్దార్ లక్ష్మీనారాయణ కోరారు.




