Ranga Reddy: మాడ్గుల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జన్మదిన వేడుకలు!
Ranga Reddy: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టు కిషన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఈ నెల 10న ఘనంగా జరగనున్నాయి.
Ranga Reddy: మాడ్గుల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జన్మదిన వేడుకలు!
రంగారెడ్డి జిల్లా: మాడ్గుల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కిషన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఈ నెల 10న ఘనంగా నిర్వహించనున్నట్లు మాడ్గుల మండలం విజయ డైరీ చైర్మన్ బొజ్జ సాయిరెడ్డి తెలిపారు.
మాడ్గుల మండల కేంద్రంలోని వాసవి ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ వేడుకలకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, రాష్ట్ర పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్ సూదిని రామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు సాయిరెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా బట్టు కిషన్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బొజ్జ సాయిరెడ్డి పిలుపునిచ్చారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.




