Tarnaka: నాచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బోనాల ఊరేగింపు!

Tarnaka: హైదరాబాద్‌లోని నాచారంలో శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

HARISH, TARNAKA
Published on: 10 Aug 2026 8:12 PM IST
Tarnaka
X

Tarnaka: నాచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బోనాల ఊరేగింపు!

తార్నాక: నాచారం విలేజ్‌ నుంచి గత 25 ఏళ్లుగా బోనం తీస్తూ అమ్మవారికి సమర్పిస్తున్నానని కొన్నే ఇందిరమ్మ తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఎండి బోనాన్ని అమ్మవారికి సమర్పించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా 100 మంది మహిళలు బోనాలతో, 100 మంది శివసత్తులతో కలిసి నాచారం మహంకాళి ఆలయాలకు వైభవంగా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఒగ్గు పూజారులు మల్లంపల్లి చంద్రయ్య, మల్లేష్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

నాచారం మహంకాళి ఆలయంలో దుర్గామాత, శివుడు, వినాయకుడు, నల్లపోచమ్మ తదితర దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించినట్లు ఇందిరమ్మ తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి అన్నీ మంచిగా జరగాలని ఆమె ఆకాంక్షించారు. 25 ఏళ్లుగా కొనసాగిస్తున్న బోనాల సమర్పణలో ఈసారి 100 బోనాలతో నిర్వహించిన ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని పేర్కొన్నారు.

బోనాల కార్యక్రమంలో శోభ, శ్రీధర్, రేణుక, సంగీత, లావణ్య, సవిత, వెంకటవ్వ, లక్ష్మి, పాలకుర్తి వెంకటవ్వ, ప్రమీల, సరిత, అఖిల్, అనురాధ, ప్రకృతి, ఐలోని స్వర్ణలత, ఐలోని నరేష్, కొన్నే వెంకన్న, కొన్నే రాజ్‌కుమార్, కొన్నే మహేష్, చౌడుర్ హరీష్, చౌడుర్ మహేష్. పాలకుర్తి నర్సిరెడ్డి, నరసింహ చారి, నాగరాజు, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story