Vikarabad: పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల నడుమ ధర్మాపూర్‌లో బోనాల జాతర
Vikarabad: వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం ధర్మాపూర్ గ్రామంలో బోనాల పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
Vikarabad: పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల నడుమ ధర్మాపూర్‌లో బోనాల జాతర
వికారాబాద్: వికారాబాద్ జిల్లా, ధారూర్ మండల పరిధిలోని , ధర్మాపూర్ గ్రామంలో ఆదివారం అంగరంగ వైభవంగా బోనాల పండుగను నిర్వహించారు. గ్రామంలోని పోచమ్మ, మైసమ్మ దేవతలకు గ్రామ పెద్దలతో కలిసి మహిళలు బోనాలను సమర్పించారు.
పోతురాజు విన్యాసాలతో, ఆట పాటలతో బోనాల జాతరను నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని కొలుస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, పాడి పంటలు విరివిగా పండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Next Story




