Hyderabad: విశ్వశాంతి కోసం చండీ పారాయణాలు, హోమం: మహర్షులు!

Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలో విశ్వశాంతి కోసం చండీ పారాయణాలు, 1108 వనమూలికలతో చండీ హోమం.

RAJESH,	WEST ZONE
Published on: 23 Oct 2026 2:25 PM IST
Hyderabad
X

Hyderabad: విశ్వశాంతి కోసం చండీ పారాయణాలు, హోమం: మహర్షులు!

Hyderabad: శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలో పీఠాధిపతులు బ్రహ్మశ్రీ కృష్ణ చాముండేశ్వరి మహర్షుల ఆధ్వర్యంలో విశ్వశాంతి కోసం చండీ పారాయణాలు, మంత్రానుష్ఠానాలు, దీక్షలు బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. సుమారు 1108 వనమూలికలతో చండీ హోమం నిర్వహించి, శ్రీ చాముండేశ్వరి అమ్మవారికి విశేష పూజలు చేశారు.

ఈ సందర్భంగా మహర్షులు మాట్లాడుతూ, భూతాపాన్ని తగ్గించేందుకు ప్రకృతి పరిరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని సూచించారు. నీటిని పొదుపుగా వినియోగించాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE