Hyderabad: అమీర్‌పేటలో ఉత్సాహంగా సాగిన సంప్రదాయ ఫ్రూట్ మిక్సింగ్ వేడుక!

Hyderabad: హైదరాబాద్ అమీర్‌పేటలో క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని కంట్రీ ఓవెన్ ఆధ్వర్యంలో సంప్రదాయ ఫ్రూట్ మిక్సింగ్ వేడుక ఘనంగా జరిగింది.

RAJESH,	WEST ZONE
Published on: 24 Nov 2026 1:32 PM IST
Hyderabad
X

Hyderabad: అమీర్‌పేటలో ఉత్సాహంగా సాగిన సంప్రదాయ ఫ్రూట్ మిక్సింగ్ వేడుక!

అమీర్పేట్: హైదరాబాద్ అమీర్‌పేటలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని కంట్రీ ఓవెన్ ఆధ్వర్యంలో సంప్రదాయ ఫ్రూట్ మిక్సింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండు ఫలాలు, డ్రై ఫ్రూట్స్‌ను ప్రత్యేకంగా మిక్స్ చేసి, క్రిస్మస్ కేకుల తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ మిశ్రమాన్ని ప్రత్యేక పద్ధతిలో నిల్వ చేసి, క్రిస్మస్ నాటికి రుచికరమైన కేకులుగా తయారు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

1993లో ప్రారంభమైన కంట్రీ ఓవెన్ 34వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వినియోగదారులకు, ఉద్యోగులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సిస్టర్ నివేదిత పాఠశాల కరస్పాండెంట్ హరిహర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పండుగల స్ఫూర్తిని, ప్రేమాభిమానాలను చాటేలా ఈ వేడుక సందడిగా సాగింది.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE