Kadthal: కడ్తాల్ మండలం న్యామతాపూర్ శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన!

Kadthal: కడ్తాల్ మండలం న్యామతాపూర్ శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు సుంకిరెడ్డి హామీ ఇచ్చారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 27 Nov 2026 9:46 PM IST
Kadthal
X

Kadthal: కడ్తాల్ మండలం న్యామతాపూర్ శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన!

రంగారెడ్డి జిల్లా: కడ్తాల్ మండలం న్యామతాపూర్ గ్రామంలోని శివాలయంలో నిర్వహించిన విఘ్నేశ్వర, నందీశ్వర విగ్రహాలతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సి ఓ ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రతి కుటుంబంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

గ్రామ అభివృద్ధికి సహకారం..

అనంతరం గ్రామస్తులు తమ గ్రామంలో స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం కల్పించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిని కోరారు. గ్రామస్తుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ఆయన, ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని న్యామతాపూర్ గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు హామీ ఇవ్వడం పట్ల సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే గ్రామ అభివృద్ధి, ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుగుణ దేవ్ సింగ్, ఉపసర్పంచ్ గోదాస్ మహేష్, విలేజ్ ప్రెసిడెంట్ ఎండీ ఫారుక్, సీనియర్ నాయకులు యాదగిరి రెడ్డి, జనార్దన్ రెడ్డి, లక్ష్మీనారాయణ, చేకూరి యాదగిరి, గోదాసు, జంగయ్య, మార్చా మల్లేష్, శ్రీశైలం, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తల్లోజు రఘు తదితరులతో పాటు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY