Shankarpally: శంకర్‌పల్లి అయ్యప్ప ఆలయంలో వైభవంగా దివ్య 18 మెట్ల పూజా కార్యక్రమం!

Shankarpally: శంకర్‌పల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో మంగళవారం దివ్య 18 మెట్ల పూజ వైభవంగా జరిగింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 24 Nov 2026 10:49 PM IST
Shankarpally
X

Shankarpally: శంకర్‌పల్లి అయ్యప్ప ఆలయంలో వైభవంగా దివ్య 18 మెట్ల పూజా కార్యక్రమం!

చేవెళ్ల నియోజకవర్గం: శంకర్‌పల్లి పట్టణ కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో నిర్వహించిన దివ్య 18 మెట్ల (పదునెట్టాంబడి) పూజా కార్యక్రమానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అయ్యప్ప స్వామి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. భక్తుల రాకతో దేవస్థానంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA