Malkajgiri: మౌలాలిలో ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు, శాంతి ర్యాలీ!
Malkajgiri: మల్కాజిగిరి నియోజకవర్గం మౌలాలిలో ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్నదానం, షర్బత్ పంపిణీతో పాటు కాప్రా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
Malkajgiri: మౌలాలిలో ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు, శాంతి ర్యాలీ!
Malkajgiri: ఈద్ మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని మౌలాలి డివిజన్‌లో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా షర్బత్ పంపిణీ, అన్నదాన కార్యక్రమాలతో పాటు ర్యాలీ నిర్వహించారు.
మౌలాలి డివిజన్‌లో నిర్వహించిన షర్బత్ పంపిణీ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజలకు షర్బత్ అందజేశారు. భరత్‌నగర్‌లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎం.జె. కాలనీలోని మహముద్ మసీదు నుంచి కాప్రా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రేమ, శాంతి, సోదరభావం, దయ, మానవతా విలువలను పెంపొందించుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం, సేవాభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ సీఐ భాస్కర్ రెడ్డి, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, విజయ్‌తో పాటు పోలీస్ సిబ్బంది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 186వ డివిజన్ అధ్యక్షుడు పోతుల వినోద్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఫారూఖ్, మౌలాలి డివిజన్ మైనార్టీ అధ్యక్షుడు షకీల్, సిద్ధిక్, పలువురు నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




