LB Nagar: ఎల్‌బీనగర్‌లో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో నిమజ్జనం!

LB Nagar: ఎల్‌బీనగర్ పాత మారుతీనగర్‌లో ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం. పాల్గొన్న కార్పొరేటర్ పవన్ కుమార్, తోట మహేంద్ర యాదవ్.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 21 Sept 2026 8:08 AM IST
LB Nagar
X

LB Nagar: ఎల్‌బీనగర్‌లో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో నిమజ్జనం!

LB Nagar: పాత మారుతీనగర్‌ రోడ్‌ నంబర్‌–2లో ఛత్రపతి శివాజీ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నిమజ్జన వేడుకల్లో యువత ఉత్సాహంగా పాల్గొని గణనాథుడికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు.

ఈ కార్యక్రమానికి కార్పొరేటర్‌ పవన్‌కుమార్‌, బీజేపీ కొత్తపేట డివిజన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ తోట మహేంద్ర యాదవ్‌ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.

యువత భారీగా పాల్గొనడంతో పాత మారుతీనగర్‌ ప్రాంతంలో సందడి నెలకొంది. భక్తులు, యువత గణేష్‌ నామస్మరణలతో ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బోగా భరత్‌కుమార్‌, పుటికలపురి చందు, బోగా వినోద్‌కుమార్‌, వికా, నాగార్జున, యకయ్య తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR