Quthbullapur: ఘనంగా సదర్ ఉత్సవం.. ఆకట్టుకున్న దున్నరాజుల విన్యాసాలు!

Quthbullapur: కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్టలో జేకే శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవం ఘనంగా జరిగింది.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 16 Nov 2026 11:15 AM IST
Quthbullapur
X

Quthbullapur: ఘనంగా సదర్ ఉత్సవం.. ఆకట్టుకున్న దున్నరాజుల విన్యాసాలు!

Quthbullapur: కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట యాదవ సంఘం బిజెపి ఓబీసీ మోర్చా మేడ్చల్ అర్బన్ జిల్లా కమిటీ చైర్మన్ జె కె శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జగద్గిరిగుట్ట లాస్ట్ బస్ స్టాప్ జంక్షన్‌లో సదర్ ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా దున్నరాజుల విన్యాసాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. దున్నరాజులను అందంగా అలంకరించి వాటితో జగద్గిరిగుట్ట యాదవ సంఘం నిర్వాహకులు సందడి చేశారు.

భారీ ఎత్తున ఏర్పాటు చేసిన వేదిక ఎదుట పెద్ద రంగవల్లుల పటాలను తీర్చిదిద్ది శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని ఉంచి పూజలు జరిపారు. అనంతరం యాదవబస్తీ నుంచి అలంకరించిన దున్నరాజులను ఊరేగింపుగా సభా వేదిక వద్దకు తీసుకొచ్చి ఆడించారు

ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, MP ఈటల రాజేందర్ ఉత్సవాల్లో పాల్గొని దున్నపోతుల విన్యాసాలను తిలకించారు.

వేడుకల్లో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్,బీజేపీ జిల్లా అధ్యక్షులు గిరి వర్దన్ రెడ్డి, రావుల శేషగిరి బీజేపీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో కన్వీనర్, మేడ్చల్ అర్బన్ జిల్లా బిజెపి అధికార ప్రతినిధి గండిరాజు యాదవ్, ex కార్పొరేటర్ గరిగె శేకర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్, రచ్చ చక్రధర్,కంది శ్రీరాములు, జగద్గిరిగుట్ట లోని పలు కుల సంఘాల నాయకులు ముఖ్య అతిథులుగా తదితరులు ఉత్సవాల్లో పాల్గొని దున్నపోతుల విన్యాసాలను తిలకించారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR