Tarnaka: భక్తుల మధ్య కోలాహలంగా మాణిక్యేశ్వరి నగర్ కృష్ణాష్టమి వేడుకలు

Tarnaka: తార్నాక పరిధిలోని మాణిక్యేశ్వరి నగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కంప్రెసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.

HARISH, TARNAKA
Published on: 6 Sept 2026 5:03 PM IST
Tarnaka
X

Tarnaka: భక్తుల మధ్య కోలాహలంగా మాణిక్యేశ్వరి నగర్ కృష్ణాష్టమి వేడుకలు

తార్నాక: శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతాఫల్ మండీ డివిజన్‌ పరిధిలోని మాణిక్యేశ్వరి నగర్‌లో ఆదివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కంప్రెసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా భక్తుల కోసం ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా గండికోట కుమార్ తన సౌజన్యంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. కార్యక్రమానికి ఎన్ఎస్ యు ఐ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆదం సృజన్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్లో పాల్గొన్నారు.

మాణిక్యేశ్వరి నగర్‌ తో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన భక్తులు, స్థానిక ప్రజలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండికోట కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సికింద్రాబాద్, వడ్డే ఓబన్న ఉత్సవ కమిటీ మెంబర్ తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story