Hafeezpet: హఫీజ్‌పేట్ డివిజన్ సమస్యలపై డీసీకు బీజేపీ వినతిపత్రం!
Hafeezpet: హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో మియాపూర్ సర్కిల్ డీసీ చంద్రకళకు ప్రజావాణిలో భాగంగా వినతిపత్రం సమర్పించారు.
Hafeezpet: హఫీజ్‌పేట్ డివిజన్ సమస్యలపై డీసీకు బీజేపీ వినతిపత్రం!
Hafeezpet: హఫీజ్ పేట్ డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో సీఎంసీ - మియాపూర్ సర్కిల్ డీసీ శ్రీమతి చంద్రకళ గారికి ప్రజావాణిలో భాగంగా, వివిధ సమస్యలపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది, హుడా కాలనీ లోనీ మల్లయ్య కుంటను అభివృద్ధి చేయాలి అని , విద్యా వాణి హై స్కూల్ ప్రక్కన ఉన్న స్థలం పార్క్ గా అభివృద్ధి చేయాలి అని, హుడా కాలనీ వాటర్ సంప్ ప్రాంతంలో సీసీ రోడ్డు పనులు పూర్తి చేయాలని,
సంబంధిత అధికారులు వెంటనే పర్యవేక్షించి, సమస్యలను పరిష్కరించాలి అని డీసీ గారిని కోరడం జరిగింది, ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రమణయ్య , హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు నరసింహ యాదవ్, డివిజన్ బీజేపీ ఓబీసీ మోర్చా కోశాధికారి పవన్ కుమార్, బీజేపీ నాయకులు విజయ్, హరీష్ మరియు ఇతరులు పాల్గొన్నారు.




