Hafeezpet: నాలా ప్రమాదం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వాసిలి చంద్రశేఖర్

Hafeezpet: నాలాలో పడి గల్లంతైన వృద్ధుడి కుటుంబాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నేత వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ పరామర్శించి, రూ. 50,000 ఆర్థిక సాయం అందించారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 26 Aug 2026 4:25 PM IST
Hafeezpet
X

Hafeezpet: నాలా ప్రమాదం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వాసిలి చంద్రశేఖర్

హఫీజ్‌పేట్: హఫీజ్‌పేట్ డివిజన్ ప్రేమ్ నగర్‌లో జులై 28న కురిసిన భారీ వర్షానికి ప్రేమ్ నగర్‌కు చెందిన బాలయ్య (60) అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు నాలాలో పడి కొట్టుకుపోయారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా అధికారుల సెర్చ్ ఆపరేషన్ మందకొడిగా సాగుతోందని, ఇప్పటివరకు ఆయన ఆచూకీ లభించకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ TRS ఇంచార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాలయ్య సతీమణి పద్మను ఓదార్చి, తన వంతు తక్షణ ఆర్థిక సాయంగా రూ. 50,000/- నగదు అందజేశారు.

పేదోడి ప్రాణమంటే అంత చులకనా?

ఈ సందర్భంగా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ‘ప్రజాపాలన’ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

* పక్షపాత వైఖరి: "ఇదే ప్రమాదం ఒక ప్రజాప్రతినిధికో, వారి బంధువులకో లేదా ఒక ధనవంతుడికో జరిగి ఉంటే అధికారులు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించే వారా? పేదవారికి ఒక న్యాయం, ఉన్నవారికి ఒక న్యాయమా?" అని ఆయన ప్రశ్నించారు.

* కలచివేసిన ఆవేదన: "నా భర్త ఎముకలైనా నాకు దక్కేలా చూడండి సార్" అంటూ బాలయ్య భార్య పద్మ గారు కన్నీరుమున్నీరవడం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కలచివేసిందని వాసిలి ఆవేదన వ్యక్తం చేశారు.

* గత ఘటనపై స్పందన: 2019లో చందానగర్ PJR ఎన్‌క్లేవ్ నాలాలో పడి శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడు మృతిచెందితే, తన సొంత నిధుల నుంచి రూ. 1.50 లక్షల సాయం అందించానని, కానీ ఆ కుటుంబానికి నేటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉద్యోగం కానీ, సాయం కానీ అందలేదని గుర్తుచేశారు.

ప్రభుత్వానికి trs డిమాండ్లు:

* స్థానిక నాయకులు హామీ ఇచ్చినట్లుగా బాలయ్య గారి పిల్లలకు వెంటనే మున్సిపల్ శాఖలో ఉద్యోగాలు ఇవ్వాలి.

* పద్మ గారికి తక్షణమే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలి.

* బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలి.

* నగరంలోని అన్ని నాలాల చుట్టూ తక్షణమే పటిష్టమైన కంచెలు (Fencing) ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇటువంటి అనర్థాలు పునరావృతం కాకుండా చూడాలి.

ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయని, ఇప్పటికైనా స్పందించి గాలింపు చర్యలను వేగవంతం చేయాలని వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ డిమాండ్ చేశారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story