Shabad: నాగర్‌గూడ గ్రామంలో ఘనంగా హర్ ఘర్ జల్ అర్పణ్ దివస్!

Shabad: షాబాద్ మండలం నాగర్‌గూడ గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా ‘హర్ ఘర్ జల్ అర్పణ్ దివస్’ నిర్వహించారు. డీఈఈ హారిక, ఏఈ వెంకటేశ్వర్ రావు, సర్పంచ్ స్వరూప పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 13 Nov 2026 6:31 PM IST
Shabad
X

Shabad: నాగర్‌గూడ గ్రామంలో ఘనంగా హర్ ఘర్ జల్ అర్పణ్ దివస్!

షాబాద్: షాబాద్ మండలం నాగర్‌గూడ గ్రామంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో హర్ ఘర్ జల్ అర్పణ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా DEE హారిక, AE వెంకటేశ్వర్ రావు హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ స్వరూప, మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజలకు నీటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.

అలాగే ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీరు అందేలా చూడటంతో పాటు, నీటి సరఫరాలో ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. గ్రామ ప్రజల భాగస్వామ్యంతోనే ఈ పథకం విజయవంతమవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ వేణుగోపాల్, వార్డు సభ్యులు మహిపాల్, అప్సర్, కృష్ణయ్య గౌడ్, గ్రామ కార్యదర్శి దయాకర్ రెడ్డి, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA