Meerpet: మీర్‌పేట్‌లో ఉత్సాహంగా హర్ ఘర్ తిరంగా అందెల శ్రీరాములు!
Meerpet: జిల్లెల్లగూడలో తులసి ముఖేష్ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
Meerpet: మీర్‌పేట్‌లో ఉత్సాహంగా హర్ ఘర్ తిరంగా అందెల శ్రీరాములు!
Meerpet: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘హర్ ఘర్ తిరంగా ఘర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా జిల్లెల్లగూడలో తులసి ముఖేష్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించారు.
బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలోని మీర్‌పేట్‌లో నిర్వహించిన ఈ యాత్రలో పాఠశాల విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలను చేతబూని పురవీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ దేశ సమగ్రత, ఐక్యతను చాటుతూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందేల శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ దేశ ప్రజల్లో జాతీయ భావాన్ని, యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమానికి పిలుపునిచ్చారని తెలిపారు.
ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.చిన్నారుల్లో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించేందుకు వారితో కలిసి తిరంగా యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు.పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, నాయకులు సిద్దాల శ్రీనివాస్, కసిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి,జిల్లా కౌన్సిల్ మెంబర్ సోమేశ్వర, గాజుల మధు, సుల ప్రభాకర్, గడ్డం జగన్, మాజీ కార్పొరేటర్లు మద్ది సబితా రాజశేఖర్ రెడ్డి, గౌరీ శంకర్, మేకల రవీందర్ రెడ్డి,కాశీరాం యాదవ్, జగన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.




