Nagole: నాగోల్‌లో బీజేపీ ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ శిబిరం’
Nagole: తెలంగాణలో కష్టపడి పనిచేస్తే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.
Nagole: నాగోల్‌లో బీజేపీ ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ శిబిరం’
Nagole: ఎల్బీనగర్ బీజేపీ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నాగోల్ బండ్లగూడలోని శ్రేయస్ కాలేజీలో 2 రోజుల పాటు నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ – 2026 జిల్లా స్థాయి శిక్షణ శిబిరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు పాల్గొన్నారు. రామ్‌చందర్ రావు మాట్లాడుతూ: పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, కార్యకర్తల పాత్ర, ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలపై నిర్వహించిన సెషన్లను ఆయన ఆసక్తిగా విన్నారు. "3 సంవత్సరాలకు ఒకసారి శిక్షణ తరగతులు జరుగుతాయి. మండలం, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు శిక్షణా శిబిరాలు జరుగుతాయి" అని తెలిపారు.
"బీజేపీ ఏ రాష్ట్రంలో అయినా కష్టపడి పనిచేస్తే అధికారంలోకి వస్తాం. తెలంగాణలో కూడా కృషి చేస్తే అధికారంలోకి వస్తాం" అని ధీమా వ్యక్తం చేశారు. "దేశ అభివృద్ధి, పరిపాలన చూసి ప్రజలు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో ప్రజలు విరక్తి చెందారు. కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టులు, కమీషన్ల కోసం పనిచేస్తోంది" అని విమర్శించారు. కార్యకర్తలకు పిలుపు: "తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాడాలి. యువత, విద్యార్థులు ఉద్యోగాల కోసం, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పోరాటం చేయాలి. యువతను బీజేపీ ఆహ్వానిస్తోంది" అని అన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ, మండల, డివిజన్ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




