Hyderabad: హరీష్ రావు పచ్చి అబద్ధాల బ్రాండ్ అంబాసిడర్!
Hyderabad: మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ నేతల తీవ్ర విమర్శలు. కరెంట్ కోతల వల్ల కాకుండా బోర్లలో నీళ్లు లేకనే పంటలు ఎండిపోయాయని వివరణ. దేవాదుల నీటి గణాంకాల వెల్లడి.
Hyderabad: హరీష్ రావు పచ్చి అబద్ధాల బ్రాండ్ అంబాసిడర్!
Hyderabad: హరీష్ రావు కాదు.. ఆయన అబద్ధాల రావు.. మేం ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఆయన అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా తయారై రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడు. బోర్లలో నీళ్లు లేక ఎండిపోయిన పంటలను వెతుక్కొని అక్కడికి వెళ్లి ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నాడు. రాష్ట్రంలో కరెంటు కోతల వల్ల ఇప్పటి వరకు ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదు. మధ్యలో కొంత ఇబ్బంది వస్తే వెంటనే సమస్యను పరిష్కరించాం.
విద్యుత్ కొరతల వల్ల కాదు.. బోర్లలో నీళ్లు లేకపోవడం వల్లనే పంటలు ఎండిపోయాయని రైతులే ఒప్పుకుంటున్నారు. అయినా హరీష్ రావు అనే అబద్ధాల రావు పచ్చి అబద్ధాలను పదే పదే చెబుతూ రైతులను మోసం చేయాలని చూస్తున్నాడు. మేడిగడ్డ దగ్గర నీళ్లు ఎత్తకుండా ఆంధ్రాకు నీళ్లు వదిలేస్తున్నారని హరీష్ రావు నీచ ప్రచారం చేస్తున్నాడు. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు లేక రైతులు అల్లాడుతుంటే వాళ్ల కన్నీళ్లపై హరీష్ రావు లాంటి వాళ్లు రాజకీయం చేస్తున్నారు.
అనావృష్టి రేవంత్ రెడ్డి సృష్టి అంటూ హరీష్ రావు దిమాక్ లేని మాటలు మాట్లాడుతున్నాడు. కరోనా సృష్టికర్త కేసీఆర్.. ఎబోలా సృష్టికర్త హరీష్ రావు.. కలరా సృష్టికర్త కేటీఆర్ అని మేం అనలేమా..? కేసీఆర్ హయాంలోనే కరోనా వచ్చింది. దానికి కారణం రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో బీజేపీ అని మేం అన్నామా..? మేం ఆనాడు రాజకీయం చేయలేదు..?కానీ బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఈ మాటలు మేం మాట్లాడం.
ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం ఉన్న విషయం రైతులందరికీ తెలుసు. ఏప్రిల్ నెల నుంచి రైతులను అప్రమత్తం చేస్తున్నాం.. వ్యవసాయ అధికారులతో రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం. పరిస్థితిని అర్థం చేసుకుని రైతులు సహకరిస్తున్నారు. కానీ కళ్లు లేని కబోదిలా హరీష్ రావు మాట్లాడుతున్నాడు. నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు ఏ మాత్రం మనస్సాక్షి ఉన్నా నిజం మాట్లాడాలి.
కాళేశ్వరం దగ్గర నుంచి కిందకు పోతున్న నీళ్లను దేవాదుల, ఆ తర్వాత సీతారామ సాగర్ దగ్గర ఎత్తిపోయడం లేదా..? హరీష్ రావు కళ్లకు ఎందుకు ఈ నీళ్లు కనిపించడం లేదు..?దేవాదుల దగ్గర 16 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారని హరీష్ రావు ఎత్తిపొడుపుల మాటలు మాట్లాడుతున్నాడు. దేవాదులలో మొత్తం 10 పంపింగ్ యూనిట్లు ఉన్నాయి. ప్రతి రోజు 10 పంపులు నిరంతరాయంగా పనిచేస్తే 0.23 టీఎంసీల నీళ్లను ఎత్తిపోయవచ్చు.
ఒక టీఎంసీ నీళ్లను ఎత్తిపోయడానికి నాలుగున్నర రోజులు పడుతుంది. హరీష్ రావు మాత్రం బుర్ర లేకుండా మాట్లాడుతున్నాడు. గత ప్రభుత్వ హయాంలో 2014–15 నుంచి 2022–23 వరకు తొమ్మిదేళ్లలో దేవాదుల నుంచి మొత్తం 86.127 టీఎంసీలు ఎత్తారు. ఏడాదికి సగటు 9.57 టీఎంసీలు మాత్రమే మా ప్రభుత్వం ఈ మూడేళ్లలో 68 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసింది.
2024–25లో 18.067 టీఎంసీలు, 2025–26లో 18.20 టీఎంసీలు ఎత్తాం.
అంటే సగటు 18.13 టీఎంసీలు. గత ప్రభుత్వ సగటుతో పోలిస్తే 89 శాతం అధికం.
ఈ ఏడాదిలో మొదటి ఐదు నెలల్లోనే 16.71 టీఎంసీలు ఎత్తాం.
సీతారామ సాగర్ ద్వారా 8.10 టీఎంసీలు ఎత్తాం అంటే కాళేశ్వరం దిగువన ఇప్పటి వరకు మొత్తం 24.81 టీఎంసీలను ఎత్తిపోశాం. ఈ నీటితో వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో లక్షలాది ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించాం. ఇప్పుడు దుమ్ముగూడెం దగ్గర కూడా ఇసుక బస్తాలేసి నీటిని నిలిపి.. తాగునీటి అవసరాలకు మళ్లిస్తున్నాం. కావాలంటే బీఆర్ఎస్ నాయకులు వెళ్లి చూడాలి గత ప్రభుత్వంతో పోలిస్తే మేం అధికారంలోకి వచ్చిన తర్వాత దిగువ గోదావరి నీటిని సమర్థంగా వినియోగించుకుంటున్నాం.
దేవాదుల ద్వారా నీటి లిఫ్టింగ్ దాదాపు రెట్టింపైంది. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను వ్యవసాయానికి సరఫరా చేస్తున్నాం. మేడిగడ్డ దగ్గర కటక వత్తితే నీళ్లు ఎలా వస్తాయి..? కాళేశ్వరం బ్యారేజీల్లో మేడిగడ్డ కుంగిపోయింది.. సుందిళ్ల, అన్నారంలో సీపేజీ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లినే ఇప్పుడు రైతులకు వరప్రదాయినిగా మారింది.
కేసీఆర్ ఆనాడే తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మా ప్రభుత్వం తుమ్మిడిహట్టి కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు మొదలుపెట్టింది. కృష్ణా జలాల్లో నీటి వాటాల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. తెలంగాణకు కృష్ణా జలాల్లో మరణశాసనం రాసింది కేసీఆర్, హరీష్ రావు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో విభజన తర్వాత తాత్కాలిక ఏర్పాటు పేరుతో తెలంగాణకు ద్రోహం చేసింది.
ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు అంగీకరించారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణకు 558 టీఎంసీల న్యాయమైన వాటా కేటాయించాలని పోరాడుతున్నారు. కరువును రాజకీయాల కోసం వాడుకోవడం హరీష్ రావుకు మంచిది కాదు. క్రాప్ హాలిడే ఉందని ఎప్పుడూ మా ప్రభుత్వం చెప్పలేదు. నీటి లభ్యత ఆధారంగా పంటలు వేసుకోవాలని మాత్రమే సూచించారు.
సన్నవడ్లపై బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసింది.. కానీ ఇప్పుడు సన్నవడ్లకు ఏ స్థాయిలో ధర వచ్చిందో అందరికీ తెలుసు. హాలిడే తీసుకుని ఫామ్ హౌస్‌లో కూర్చున్నది కేసీఆర్.




