Hyderabad: హత్కర్ఘా మేళా ప్రారంభం.. చేనేత వస్త్రాల ప్రదర్శన!
Hyderabad: హైదరాబాద్ శ్రీ సత్యసాయి నిగమాగమంలో హత్కర్ఘా మేళా ప్రారంభమైంది. అక్టోబర్ 13 నుంచి 26 వరకు జరిగే ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా చేనేత ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
Hyderabad: హత్కర్ఘా మేళా ప్రారంభం.. చేనేత వస్త్రాల ప్రదర్శన!
Hyderabad: దేశవ్యాప్తంగా చేనేత కార్మికులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంతోపాటు, వివిధ రాష్ట్రాల చేనేత ఉత్పత్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత హత్కర్ఘా మేళా (రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన)ను హైదరాబాద్లోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ప్రారంభించారు.
ఈ మేళాను నందమూరి మోహన రూప, నందమూరి సీమంతిని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ కమిషనర్ జి. రేఖారాణి ప్రారంభించారు. అక్టోబర్ 13 నుంచి 26వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది.ఈ మేళాలో దేశవ్యాప్తంగా 76 చేనేత సంఘాలు, సంస్థలు పాల్గొంటున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 39 సంఘాలతోపాటు తెలంగాణకు చెందిన ఐదు చేనేత సంఘాలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి.
బీహార్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, జమ్మూకశ్మీర్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల చేనేత ఉత్పత్తులు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి.ప్రదర్శనలో కాటన్, పట్టు చీరలు, దుస్తుల వస్త్రాలు, బెడ్షీట్లు, కలంకారీ, జంథాని వస్త్రాలు, కార్పెట్లు తదితర విభిన్న రకాల చేనేత ఉత్పత్తులను ఉత్పత్తిదారుల ధరలకే విక్రయిస్తున్నారు.
నగర ప్రజలు ఈ మేళాను సందర్శించి నాణ్యమైన చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడంతోపాటు, చేనేత కార్మికులను ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరుతున్నారు.




