Hayathnagar: హయత్ నగర్‌లో హైడ్రా ‘యాక్షన్’.. దశాబ్దాల పార్క్ స్థలం సేఫ్!

Hayathnagar: హైదరాబాద్ హయత్ నగర్ బాగాయిత్‌నగర్ సర్వే నంబర్ 233-236 పరిధిలోని కాలనీ పార్కు స్థలాన్ని కబ్జాదారుల నుండి హైడ్రా (HYDRA) అధికారులు కాపాడారు.

AJAY, HAYATH NAGAR
Published on: 27 May 2026 9:28 PM IST
Hayathnagar
X

Hayathnagar: హయత్ నగర్‌లో హైడ్రా ‘యాక్షన్’.. దశాబ్దాల పార్క్ స్థలం సేఫ్!

Hayathnagar: హయత్ నగర్ లోని బాగాయిత్‌నగర్, కాదీబౌడ్ కాలనీ, సర్వే నంబర్లు 233, 234, 235, 236 పరిధిలో ఉన్న మా కాలనీ 1984 సంవత్సరంలో లేఅవుట్ చేయబడింది. ఫ్లాట్ నంబర్లు 69, 70, 47, 48 ప్రాంతం మొదటి నుంచే కాలనీ పార్క్‌గా ఉపయోగించబడుతూ వస్తోంది. గత నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రదేశంలో గణేష్ నవరాత్రులు, అమ్మవారి పూజలు, బతుకమ్మ పండుగలు, జెండా వందనం వంటి అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కాలనీ ప్రజలు ఎంతో ప్రేమతో ఈ పార్క్‌ను కాపాడుకుంటూ వచ్చారు.

అయితే ఇటీవల కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఫేక్ డాక్యుమెంట్ల ఆధారంగా ఈ నాలుగు ప్లాట్లు తమవి అని చెప్పి, మార్చి 24న రిజిస్ట్రేషన్ చేసుకున్నామని పేర్కొంటూ కాలనీలోకి వచ్చి పార్క్ బోర్డులు, ప్రీకాస్ట్ నిర్మాణాలు మరియు జెండాలకు సంబంధించిన ఏర్పాట్లు ధ్వంసం చేశారు. దీంతో కాలనీ ప్రజలంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఈ విషయంలో మేము సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయగా, HYDRA అధికారులు వెంటనే స్పందించి పూర్తి వివరాలు, డాక్యుమెంట్లు పరిశీలించారు. ముఖ్యంగా రంగనాథ్ సార్ గారు ఎంతో బాధ్యతతో వ్యవహరించి, కాలనీ ప్రజలు మరియు కొనుగోలు చేసిన వారిని పిలిపించి సమావేశం నిర్వహించారు. వారి డాక్యుమెంటేషన్‌లో లోపాలు ఉన్నాయని స్పష్టంగా తెలియజేసి, అక్రమంగా ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగించే చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా పార్క్ చుట్టూ తిరిగి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కాలనీ ప్రజలకు న్యాయం చేశారు.

42 సంవత్సరాలుగా ఈ స్థలం ఎప్పుడూ రిజిస్ట్రేషన్ కాలేదని, ఈసీ తీసినా “నిల్”గానే వచ్చిందని అందరికీ తెలుసు. అలాంటి స్థలాన్ని అకస్మాత్తుగా రిజిస్ట్రేషన్ చేయడం చాలా అనుమానాస్పదం. వ్యవస్థలోని కొన్ని లోపాలను ఉపయోగించుకుని ఇలాంటి పనులు చేసిన వారిపై సరైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం.

మా కాలనీకి ఉన్న ఏకైక పార్క్‌ను కాపాడి, మా సమస్యను మర్యాదపూర్వకంగా, వేగంగా పరిష్కరించిన HYDRA అధికారులకు, ముఖ్యంగా రంగనాథ్ సార్ గారికి కాలనీ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ సహాయం వల్ల మా కాలనీ ప్రజలకు ఎంతో న్యాయం జరిగింది.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story