Hayathnagar: అబ్దుల్లాపూర్‌మెట్‌లో ప్రజా చైతన్య యాత్ర ప్రారంభం!

Hayathnagar: మండలంలో ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించారు. బొమ్మగాని ధర్మాభిక్షం విగ్రహానికి నివాళులర్పించి, ప్రజా సమస్యలపై అవగాహన కల్పిస్తూ ఈ యాత్ర చేపట్టారు.

AJAY, HAYATH NAGAR
Published on: 20 Aug 2026 6:13 PM IST
Hayathnagar
X

Hayathnagar: అబ్దుల్లాపూర్‌మెట్‌లో ప్రజా చైతన్య యాత్ర ప్రారంభం!

Hayathnagar: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల యోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ బొమ్మగాని ధర్మాభిక్షం గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ ముత్యాల యాదిరెడ్డి గారు, సీపీఐ అబ్దుల్లాపూర్‌మెట్ మండల కార్యదర్శి అజ్మేరా హరి సింగ్ నాయక్, సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బతి లక్ష్మణ్, అబ్దుల్లాపూర్‌మెట్ మండల సహాయ కార్యదర్శి కేతరాజు నరసింహ, బీవోసీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి ప్రసాద్తో పాటు మండల కౌన్సిల్ కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఈ ప్రజా చైతన్య యాత్ర ద్వారా ప్రజా సమస్యలు, హక్కులపై అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story