Hayathnagar: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఉన్నతాధికారులు
Hayathnagar: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను ఉన్నతాధికారులు తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసులు, డయల్-100 స్పందన తీరును పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Hayathnagar: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఉన్నతాధికారులు
హయత్‌నగర్: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను సమగ్రంగా తనిఖీ చేసి, పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న సీడీ ఫైల్స్, కేసులకు సంబంధించిన రికార్డులు, స్టేషన్ రికార్డుల నిర్వహణ, CCTNS అప్‌డేషన్, డయల్-100 కాల్స్ స్పందన, పెండింగ్ కేసుల వివరాలు తదితర అంశాలను పరిశీలించి సమీక్షించాను.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేసి, భద్రపరచాలని అధికారులకు, సిబ్బందికి సూచించాను. కేసులకు సంబంధించిన వివరాలను CCTNSలో ఎలాంటి జాప్యం లేకుండా క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలని ఆదేశించాను. డయల్-100 ద్వారా వచ్చే ఫిర్యాదులు, అత్యవసర సమాచారంపై తక్షణమే స్పందించి, ప్రజలకు అవసరమైన పోలీస్ సేవలను వేగంగా అందించాలని సూచించాను.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను గౌరవంగా స్వీకరించి, వాటిపై నిష్పక్షపాతంగా స్పందిస్తూ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డు గదులు, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను కూడా పరిశీలించారు.
ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అధికారులు, సిబ్బందికి సూచించాను.




