Hyderabad: కొత్త కార్మిక చట్టాలపై హెచ్‌సీయూలో నిరసన జ్వాలలు!

Hyderabad: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (UoH) లో కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. కేంద్ర ప్రభుత్వ కొత్త కార్మిక చట్టాలు

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 30 Jun 2026 12:16 PM IST
Hyderabad
X

Hyderabad: కొత్త కార్మిక చట్టాలపై హెచ్‌సీయూలో నిరసన జ్వాలలు!

హైదరాబాద్: కేంద్రీయ విశ్వవిద్యాలయం (UoH) లో కాంట్రాక్ట్ కార్మికులు మరోసారి ఉద్యమబాట పట్టారు. తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలని, కార్మిక హక్కుల కాలరాటోను అరికట్టాలని డిమాండ్ చేస్తూ వర్సిటీ పరిపాలనా విభాగం ఎదుట కార్మికులు నిరవధిక నిరసనను ప్రారంభించారు.

హక్కులను కాలరాస్తున్న కొత్త కార్మిక చట్టాలు..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాల (Labour Codes) వల్ల తాము తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయామని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ చట్టాల అమలుతో తమ ఉద్యోగ భద్రత కరువైందని, కార్యాలయంలో రక్షణలు బలహీనపడ్డాయని వారు ఆరోపిస్తున్నారు.

దశాబ్దాలుగా తాము పోరాడి సాధించుకున్న ప్రాథమిక కార్మిక హక్కులను సైతం ఈ కొత్త చట్టాల సాకుతో అణచివేస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు.

కొత్త కాంట్రాక్టర్ తీరుపై ఆగ్రహం..

ఇటీవలే వర్సిటీకి వచ్చిన కొత్త కాంట్రాక్టర్ నియామకంతో పరిస్థితి మరింత జటిలంగా మారిందని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి..కొత్త కాంట్రాక్టర్ ఈ కార్మిక చట్టాల నిబంధనలను ఆసరాగా చేసుకుని, మాకున్న పాత హక్కులను, ప్రయోజనాలను పూర్తిగా రద్దు చేశారు.

దీనివల్ల పని ప్రదేశంలో పని ఒత్తిడి పెరగడమే కాకుండా, మా జీవనోపాధికి తీవ్ర ముప్పు వాటిల్లింది." అని ఒక కార్మిక ప్రతినిధి ఆరోపించారు.

డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేదే లేదు..

వర్సిటీ యాజమాన్యం తక్షణమే స్పందించి, తమతో చర్చలు జరపాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయమైన, గౌరవప్రదమైన పని వాతావరణాన్ని కల్పించే వరకు మరియు తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే వరకు ఈ నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

ఈ నిరసనల నేపథ్యంలో యూనివర్సిటీలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో, పరిపాలనా విభాగం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story