Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు 8 జిల్లాలకు ఆరెంజ్, 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్!
Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలు. హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయం. రాష్ట్రంలోని 24 జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు.
Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు 8 జిల్లాలకు ఆరెంజ్, 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్!
Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు మూడు కార్పొరేషన్ల సిబ్బంది రంగంలోకి దిగారు.
మరోవైపు వినాయకులను మండపాలకు తరలించే వారు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ సూచించింది. అలాగే రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే రెండ్రోజులుగా వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో, మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.




