Hyderabad: ప్రధాని సభకు పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బందోబస్తు
Hyderabad: ప్రధాని మోదీ సభ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Hyderabad
Hyderabad: ప్రధాని పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసాము. రేపు సాయంత్రం జరగబోయే సభకు లక్ష మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నాం. భద్రత కోసం 2000 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులతో మోహరింపు చేపట్టాం. ట్రాఫిక్ నియంత్రణకు 550 మంది ట్రాఫిక్ పోలీసులతో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ముగ్గురు డీసీపీలు, అయిదుగురు అదనపు డీసీపీలు పర్యవేక్షణలో భద్రతా చర్యలు కొనసాగనున్నాయి. 21 ఏసీపీలు, 57 ఇన్‌స్పెక్టర్లు విధుల్లో పాల్గొననున్నారు. బాంబ్ స్క్వాడ్లు, స్నిఫర్ డాగ్స్, OCTOPUS, SOT బృందాలతో తనిఖీలు చేస్తున్నాం. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో సీసీటీవీ నిఘా కట్టుదిట్టంగా ఉంటుంది. అన్ని ప్రవేశ ద్వారాల వద్ద స్క్రీనింగ్ తప్పనిసరి చేసాం. డ్రోన్లు, యూఏవీలు, కెమెరాలు, బ్యాగులు, బ్యానర్లు నిషేధం. రేపు ఉదయం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు డ్రోన్ల నిషేధం అమల్లో ఉంటుంది. బేగంపేట్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్లపై ఆంక్షలు విధించాం. పరేడ్ గ్రౌండ్స్, బేగంపేట్, పేరడైజ్, పాట్నీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నాం. వాహనాలు కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే నిలపాలి. ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. నల్గొండ, ఖమ్మం, వరంగల్, భువనగిరి నుంచి వచ్చే బస్సులకు ఉప్పల్ పార్కింగ్ ఏర్పాటు చేశాం. ఉప్పల్ నుంచి మెట్రో ద్వారా పరేడ్ గ్రౌండ్స్‌కు రావాలి. సభ ప్రాంగణంలో వైద్య, అగ్నిమాపక, అత్యవసర సేవల ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. మీడియా ప్రతినిధులు, పార్టీ నాయకులు భద్రతా నిబంధనలు పాటించాలి. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.




