Hyderabad: ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ చిత్రం నుంచి ‘ఏదో బాగుందే’ పాట విడుదల!
Hyderabad: ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ చిత్రం నుంచి ‘ఏదో బాగుందే’ లిరికల్ సాంగ్ విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు.. అక్టోబర్ 2న సినిమా విడుదల.
Hyderabad: ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ చిత్రం నుంచి ‘ఏదో బాగుందే’ పాట విడుదల!
Hyderabad: రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ రాజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'ఏ నిమిషానికి ఏమి జరుగునో'. ఒక విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్ రూపొందిస్తున్న ఈ సినిమాలో రతిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాయితేజ దర్శకుడు.
లక్కీ మీడియా, కేడీ అండ్ కో బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్, దీవెల శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణనంతర పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.కాగా ఈ చిత్రం నుంచి కృష్ణకాంత్ రచించిన ఏదో బాగుందే అనే లిరికల్ వీడియోను ప్రముఖ యువ కథానాయకుడు శ్రీవిష్ణు విడుదల చేశారు.
ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ '' సాంగ్ చాలా ఫ్రెష్‌గా ఉంది విజువల్స్ బాగున్నాయి. సాంగ్ అందరికి నచ్చుతుంది. సంగీత దర్శకుడు శశాంక్ మంచి ట్యూన్ అందించాడు. ఈ సినిమా టైటిల్‌తో సహా అన్ని ఫ్రెష్‌గా ఉన్నాయి. టైమ్ లూప్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారని తెలిసింది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. తప్పకుండా ఈ సినిమా విజయం సాధించి ఈ సినిమాకు పనిచేసిన అందరికి మంచి పేరు తీసుకరావాలని కోరుకుంటున్నాను' అన్నారు.
అఖిల్ రాజ్, రతిక, షైనింగ్ ఫణి, రాజేష్ ఉల్లి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్: శశాంక్ తిరుపతి, కో ప్రొడ్యూసర్: ఠాగూర్, నితీష్, నిఖిల్, డీవోపీ: రవికిరణ్ బోయడపు, నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, దీవెల శ్రీనివాసరావు, రచన-దర్శకత్వం: సాయితేజ.




