Hyderabad: రోడ్డుపై బైఠాయించిన హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్!

Hyderabad: పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరెస్ట్ అయిన హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లను పరామర్శించేందుకు మాజీ మంత్రులు

MOHD MOHIUDDIN, YAKUTHAPURA
Published on: 2 July 2026 5:20 PM IST
Hyderabad
X

Hyderabad: రోడ్డుపై బైఠాయించిన హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్!

హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు, RS ప్రవీణ్ కుమార్ అరెస్ట్ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.

ఈ క్రమంలో మీడియాకు కూడా పోలీసులు అనుమతి నిరాకరించడం వివాదాస్పదంగా మారింది.

తెలంగాణ భవన్ వద్ద బీఆర్‌ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు, RS ప్రవీణ్ కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ విషయం తెలిసి న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులను పోలీసులు స్టేషన్‌లోకి అనుమతించలేదు. ప్రధాన గేటుకు తాళం వేసి మీడియాతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను కూడా అడ్డుకున్నారు.

ఈ చర్యపై మీడియా ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేయగా, మరోవైపు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న హరీష్ రావు కార్యకర్తలతో మాట్లాడారు.చర్చకు రావాలని మంత్రులకు కుర్చీ సిద్ధంగా ఉందని RS ప్రవీణ్ కుమార్ ఒక కుర్చీకి మంత్రుల పేర్లు వ్రాసి ఉంచామని ఆయన వ్యాఖ్యలు చేశారు..

అనంతరం పోలీసుల తీరుకు నిరసనగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

ఇదిలా ఉండగా, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు వరుసగా కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

Next Story