Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!

Hyderabad: హైదరాబాద్ కిషన్‌బాగ్‌లో భార్య నిషాత్ ఫాతిమాను కత్తితో పొడిచి చంపిన భర్త సులేమాన్ బిన్ మాజీ.

SYED MUJTABA HUSSAIN, OLD CITY
Published on: 8 Jun 2026 7:13 AM IST
Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్‌బాగ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సులేమాన్ బిన్ మాజీ అనే వ్యక్తి తన భార్య నిషాత్ ఫాతిమా (28)ను కత్తితో పొడిచి హత్య చేసిన అనంతరం ఇంటికి తాళం వేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు.

మధ్యాహ్నం సమయంలో జరిగిన ఈ ఘటన కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. హత్య అనంతరం వారి ఇద్దరు చిన్నారులను మరో గదిలో బంధించి నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న బహదూర్‌పురా పోలీసులు క్లూస్ టీమ్‌తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

నిందితుడు రెండో వివాహం చేసుకున్నట్లు సమాచారం. కుటుంబ వివాదాలు, తరచూ జరిగే గొడవల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.

SYED MUJTABA HUSSAIN, OLD CITY

SYED MUJTABA HUSSAIN, OLD CITY

Next Story