Ghatkesar: అమ్మవారి ఆశీస్సులు అందుకున్న వేముల మహేష్ గౌడ్.. ఘాట్‌కేసర్‌

Ghatkesar: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం ఇస్మాయిల్‌ఖాన్‌గూడలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి 37వ వార్షిక కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది.

KARUNAKAR, UPPAL
Published on: 12 May 2026 4:57 PM IST
Ghatkesar
X

Ghatkesar: అమ్మవారి ఆశీస్సులు అందుకున్న వేముల మహేష్ గౌడ్.. ఘాట్‌కేసర్‌

ఘట్‌ కేసర్: మేడ్చల్ జిల్లా ఇస్మాయిల్‌ఖాన్‌గూడలోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవతా సమేత శ్రీ రేణుక ఎల్లమ్మదేవి దేవాలయంలో రేణుక ఎల్లమ్మదేవి 37వ వార్షిక కళ్యాణ మహోత్సవం మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని ఆలయ చైర్మన్ అండ్ ఫౌండర్ ఈగ లలిత కృష్ణ ముదిరాజ్, ఆలయ ధర్మకర్తలు ఈగ మధు ముదిరాజ్, ఈగ నందిని రాము ముదిరాజ్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించి ఆశీస్సులు పొందారు.

కళ్యాణ మహోత్సవంలో నగర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవాయిద్యాలు, ప్రత్యేక హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నడుమ ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఎంతో మహిమగల ఈ దేవాలయంలో భక్తులు కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయని స్థానికులు విశ్వసిస్తున్నారు. అనంతరం పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానికులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story