Hyderabad: కుత్బుల్లాపూర్‌లో నీటి కష్టాలు..

Hyderabad: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లెనిన్ నగర్‌లో తాగునీరు మురుగు కాలువల పాలు కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 5 Jun 2026 5:26 PM IST
Hyderabad
X

Hyderabad: కుత్బుల్లాపూర్‌లో నీటి కష్టాలు..

హైదరాబాద్: నగరప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు వేల కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తీసు కొస్తున్నారు. నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేందుకు ప్రభుత్వం వేలు ఖర్చు చేస్తోందని జల మండలే చెబుతోంది. ఓవైపు కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా సక్రమంగా లేదని తాజాగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే జలమండలి కార్యాలయం ముందు ఈమధ్య ధర్నా చేశారు.

అయినా నీటి వృథాపై అధికారులకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు. లీకేజీలతో చాలా కాలంగా లక్షల లీటర్ల తాగునీరు వృథాగా మురుగులో కలిసి వృధాగా పోతున్నా.. పట్టించుకునే వారు కరవయ్యారు. ఈ విషయాన్ని గతంలో ‘హెచ్ఎంటీవీ' కథనాలను ప్రచురించి జలమండలి మేనేజర్ మాధవి దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోలేదు.

లెనిన్ నగర్ లో చాలాకాలంగా మంచినీటి పైపులో నుండి లీక్ అవుతున్న నీరు దాదాపు కిలోమీటర్ పొడవు నీరు ప్రవహించి వృధాగా నేల పాలవుతున్న మంచినీరు, అటుగా వెళుతున్న వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా మంచినీరు వృధాగా పోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story