Kapra: హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ బ్యూరో సభ్యులకు ఐడీ కార్డుల పంపిణీ!
Kapra: హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ బ్యూరో నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం, సర్టిఫికెట్ల ప్రదానోత్సవం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా జరిగింది.
Kapra: హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ బ్యూరో సభ్యులకు ఐడీ కార్డుల పంపిణీ!
కాప్రా: ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై నూతన సభ్యులకు అభినందనలు తెలిపారు. సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి ఆర్.నరసింహ గౌడ్ లు తాము ఇప్పటివరకు చేపట్టిన కార్యకలాపాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సేవా భావంతో ప్రజలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే సంస్థలు సమాజ చైతన్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కె.వి. గీతా సింధు, చిందం మల్లేష్, గడ్డం సాయి కిరణ్, సురేష్ అడ్లూరి, ఎస్. యువరాజ్, డి.రమ్యశ్రీ,, పి వి వి ఎస్ ఎన్ ధనలక్ష్మి, టి విజయలక్ష్మి లకు ఆయన గుర్తింపు కార్డులు, నియామక పత్రాలను అందజేశారు.
సభ్యులు నిబద్ధతతో సేవలందిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమ నిర్వాహకులను అభినందిస్తూ, సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు BRS పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




