Uppal: నర్సుగా పనిచేస్తున్న భార్యను చంపి పరారైన క్యాబ్ సూపర్‌వైజర్!
Uppal: ఉప్పల్ పరిధిలోని చిలకానగర్‌లో దారుణం. భార్య శీలంపై అనుమానంతో పి. సురేష్ అనే వ్యక్తి, తార్నాకలో నర్సుగా పనిచేస్తున్న భార్య జెస్సికాను దారుణంగా హత్య
Uppal: నర్సుగా పనిచేస్తున్న భార్యను చంపి పరారైన క్యాబ్ సూపర్‌వైజర్!
ఉప్పల్: భార్య శీలంపై అనుమానం ఓ కుటుంబంలో విషాదానికి దారితీసింది. తార్నాకలో నర్సుగా పనిచేస్తున్న భార్యను భర్త హత్య చేసి పరారైన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి చిలకానగర్ లోని ఆదర్శనగర్ తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిల్కానగర్ ఆదర్శ్‌నగర్‌లో నివాసం ఉంటున్న పి. సురేష్ (41) సఫిల్‌గూడలో క్యాబ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు.
అతని భార్య పి. జెస్సికా (38) తార్నాకలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి 2015లో వివాహం కాగా, 9 సంవత్సరాల కుమార్తె ఉంది. హత్య అనంతరం మృతురాలి బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, భార్య జెస్సికా శీలంపై అనుమానం పెంచుకున్న సురేష్ ఈ విషయమై తరచూ ఆమెతో గొడవ పడేవాడని తెలిసింది.
ఈ క్రమంలో శనివారం ఆమెపై దాడి చేసి హత్య చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




