Husnabad: హుస్నాబాద్‌లో భారీ ధర్నా: రోడ్డెక్కిన మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్!

Husnabad: అసెంబ్లీలో బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడికి నిరసనగా హుస్నాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ ఆధ్వర్యంలో భారీ ధర్నా, ర్యాలీ చేపట్టారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 8 Sept 2026 2:53 PM IST
Husnabad
X

Husnabad: హుస్నాబాద్‌లో భారీ ధర్నా: రోడ్డెక్కిన మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్!

Husnabad: తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తూ హుస్నాబాద్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుంచి భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళా నాయకులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు వెళ్తుంటే వారిని పోలీసులతో అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీ వొడితల సతీష్ కుమార్ తీవ్రంగా ఖండించారు.

ముఖ్యంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా పోలీసులు దురుసుగా వ్యవహరించడం తీవ్రంగా ఖండించదగిన విషయమని అన్నారు.

“అసెంబ్లీ సాక్షిగా మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ఇలాంటి ప్రవర్తన జరగడం తెలంగాణ సమాజం సిగ్గుపడే విషయం. మహిళలకు గౌరవం ఇస్తామని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం.. ఒకవైపు మహిళా సాధికారత గురించి మాట్లాడుతూనే మరోవైపు మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులతో ఇలా వ్యవహరించడం ఏ విధమైన మహిళా గౌరవం?” అని సతీష్ కుమార్ ప్రశ్నించారు.

మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనకు ప్రతి మహిళా సమాజం స్పందించాలి.

మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటన కేవలం బీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన విషయం కాదని, ప్రజాస్వామ్యాన్ని, మహిళా గౌరవాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అంశమని సతీష్ కుమార్ అన్నారు.

“సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు వరుసగా నిర్వహించిన కార్యక్రమాలతో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అయినా ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే వరకు, ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్‌ఎస్ పార్టీ వెనక్కి తగ్గదు” అని వొడితల సతీష్ కుమార్ స్పష్టం చేశారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD

Next Story