Hyderabad: హైదరాబాద్‌లో 'ఇన్‌స్పైర్ మానక్ మెంటర్‌షిప్' వర్క్‌షాప్!

Hyderabad: హైదరాబాద్ అబిడ్స్‌లో ఇన్‌స్పైర్ మానక్ మెంటర్‌షిప్ కార్యక్రమం ఘనంగా జరిగింది.

GIRI, CENTRAL ZONE
Published on: 15 Jun 2026 3:30 PM IST
Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌లో 'ఇన్‌స్పైర్ మానక్ మెంటర్‌షిప్' వర్క్‌షాప్!

హైదరాబాద్: నేటి విద్యార్థులు, యువత సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారని CBSE కమిటీ సభ్యుడు అనిల్ ప్రధన్ అన్నారు. పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణ, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందిచాలనే లక్ష్యంతో హైదరాబాద్ అబిడ్స్ లో ఇన్‌స్పైర్ మానక్ మెంటర్‌షిప్ ను నిర్వహించారు.

ఫౌండర్‌ కనెక్ట్, తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ, యంగ్ టింకర్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ వ్యాప్తంగా 150 మందికి పైగా విద్యార్థి ఆవిష్కర్తలు, 90 మందికి పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యంగ్ థింకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు , సీబీఎస్సీ కమిటీ మెంబర్ అనిల్ ప్రధాన్ కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన విద్యార్థులకు ఆవిష్కరణాత్మక ఆలోచనలు, డిజైన్ థింకింగ్ వంటి పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు.

ఆవిష్కరణ, సృజనాత్మకత, నాయకత్వం, స్టార్టప్ పర్యావరణం, సమస్య పరిష్కార నైపుణ్యాలు వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించారు. యువ ఆవిష్కర్తలను ప్రోత్సహిస్తూ తెలంగాణలో భవిష్యత్ ఆవిష్కరణల నిర్మాణానికి ఈ కార్యక్రమం కీలక వేదిక అవుతుందని ఫౌండర్ కనెక్ట్ నిర్వాహకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ కాంపిటీషన్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందజేస్తారని వారు తెలిపారు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE

Next Story