Hyderabad: సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

Hyderabad: శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ఏఐటీయూసీ నాయకులు హెచ్చరించారు.

GIRI, CENTRAL ZONE
Published on: 15 Nov 2026 6:05 PM IST
Hyderabad
X

Hyderabad: సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

హైదరాబాద్: తెలంగాణ ఆత్మగౌరవానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ప్రతీకగా ఉన్న సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలను సహించేది లేదని ఏఐటీయూసీ నాయకులు హెచ్చరించారు. కొత్తగూడెం జిల్లాలోని కోయగూడెం-3, మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే బొగ్గు తవ్వకాలను అడ్డుకోవడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కార్మికులను సమీకరించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ, సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, కార్యదర్శి కె.రాజకుమార్‌ మాట్లాడారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతున్న సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం దుర్మార్గమని నరసింహ విమర్శించారు.

తెలంగాణ బొగ్గు సంపదను ప్రైవేటు సంస్థలకు అప్పగించే హక్కు ఎవరిచ్చారని సీతారామయ్య ప్రశ్నించారు. గతంలో సింగరేణికే కేటాయించే గనులను ప్రస్తుతం వేలం వేయడం అన్యాయమన్నారు. సింగరేణికి కొత్త ప్రాజెక్టులు కేటాయించకపోతే సంస్థ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని రాజకుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 80 వేల మంది కార్మికుల ఉపాధికి ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రెండు బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE